కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు – మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? తీసుకోవలసిన జాగ్రత్తలు.. | మానవ శరీరంలో కరోనా లక్షణాలు | తెలుగులో కరోనా రెండవ వేవ్ లక్షణాలు | కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు
కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ యొక్క ప్రమాదం అయితే మనకి ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి ఈ Covid 19 ఎంతో మందిని బలితీసుకుంది. ఈ సెకండ్ వేవ్ నుంచి కాపాడుకోవడానికి మనవంతు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు – మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం మొదలగునవి. ఈ కరోనా సెకండ్ వేవ్ లక్షణాలకు వస్తే, ఇది చాలా మందిలో విపరీతమైన లక్షణాలు కనబరుస్తుంది. సంవత్సరం కంటే ఎక్కువగా ఈ వైరస్ అందర్నీ పట్టిపీడిస్తోంది. ఈ కరోనా సెకండ్ వేవ్ యొక్క లక్షణాలు కొంతమందిలో తక్కువగానూ కొంత మందిలో ఎక్కువ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు ఏమైనా ఈ మహమ్మారి బారిన పడకుండా మనం అయితే ఎంత జాగ్రత్తలు తీసుకుంటామో అంత మంచిది. ఈ వైరస్లో మనకి మొదట వచ్చిన వైరస్ కంటే కొత్త రకమైన వేరియంట్స్ కనబడుతున్నాయి.
Corona virus (Covid – 19) Safety Precautions in English
Contents
కరోనా సెకండ్ వేవ్ లక్షణాలు – తీసుకోవలసిన జాగ్రత్తలు
భారతదేశంలో మొదట వచ్చిన covid 19 virus కంటే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో వచ్చిన వైరస్ చాలా ప్రమాదకరమని మనకి నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ సెకండ్ వేవ్ వైరస్లో పాత లక్షణాలే కాకుండా మరికొన్ని కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ కరోనా లక్షణాల్లో చూస్తే
- శ్వాస ఆడకపోవడం
- జ్వరం ఉండడం
- దగ్గు, తలనొప్పి ఉండడం
- ఒళ్ళు నొప్పులు
- గొంతు బాగా లేకపోవడం
- నీరసంగా ఉండటం
వంటి లక్షణాలు సాధారణంగా వైరస్ లో కనబడు తున్నాయి.
Covid-19 Vaccine Registration 2021 | Online Registration for Corona Virus Vaccination
కరోనా సెకండ్ వేవ్ లో మనకి కొత్తగా కనబడుతున్న లక్షణాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.
శ్వాస ఆడకపోవడం:
శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది గా ఉండడం మనకు ఈ కరోనా సెకండ్ వేవ్ లో చాలా మందిలో కనబడటం జరుగుతుంది. అయినా ఇప్పటికే మనకి దేశంలో ఆక్సిజన్ కొరత కూడా ఉంది. ఇటువంటి సమస్యలో మనం ఈ లక్షణాల నుంచి బయట పడటం కష్టమని కూడా మనకి అనిపిస్తుంది. ఈ శ్వాస అందకపోవడం తో పాటు గుండెల్లో గట్టిగా పట్టేసినట్టు కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. వైరస్ కారణంగా మనకి రక్తంలోని ఆక్సిజన్ శాచ్యురేషన్ లెవెల్స్ కూడా తగ్గుతాయి అని నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కొన్ని సార్లు ఊపిరితిత్తులు ఫెయిల్ అవ్వడం కూడా అవ్వచ్చు అని నిపుణులు భావిస్తున్నారు…
గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్:
దీంట్లో ముఖ్యంగా మనకి తిన్న ఆహారంలో అరుగుదల ఇబ్బందులు, నోరు ఎండడం, కడుపు నొప్పి, పెద్దపేగులో కొన్ని రకాల ఇబ్బందులు, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ ఇన్ఫెక్షన్ కారణంగా మనకు వాంతులు, కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి, కావున ఈ లక్షణాలు కూడా మనకి కరోనా లక్షణాలు అని చాలా మంది డాక్టర్లు సూచిస్తున్నారు.
వినికిడి లోపం:
సెకండ్ వేవ్ లో మరొక కొత్త లక్షణం మనకి చెవులు వినబడక పోవడం కొంత మందిలో, మరికొద్ది మందిలో తక్కువగా వినపడడం లాంటి సమస్యలు మనకు కనిపిస్తున్నాయి. కరోనా వచ్చిన వ్యక్తికి మొదటి వారంలో ఈ లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత మనకి ఆ వ్యక్తికి సోకిన ఇన్ఫెక్షన్ ని బట్టి ఈ సమస్య పెరుగుతుంది.
నీరసంగా ఉండటం:
మరొక లక్షణం నీరసంగా ఉండటం. దీంట్లో కరోనా వైరస్ బారిన పడిన వ్యక్తికి నీరసం ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం అలసటగా అనిపించడం వంటివి కూడా కనబడుతున్నాయి. దీంతోపాటు కళ్లు ఎర్రబడటం , దురద పెట్టడం మరియు కళ్లు నుండి నీరు కారడం వంటి లక్షణాలు కూడా కొంతమందిలో కనిపిస్తున్నాయి.
డయేరియా:
డయేరియా కరోనా సోకిన వ్యక్తి లో ఒక లక్షణంగా మనకి కనిపిస్తుంది. ఇది 14 రోజుల వరకు ఉంటుంది. ఈ సమస్య అజీర్తి కారణంగా వచ్చే సమస్య కూడా కావచ్చు. కాకపోతే ఈ డయేరియా కూడా కరోనా లో ఒక లక్షణంగా ఉంది అని చాలా మంది డాక్టర్లు గుర్తిస్తున్నారు.
తలనొప్పి:
కరోనా వైరస్ సోకిన వారిలో మరొక లక్షణం తలనొప్పి. మామూలుగా వచ్చే తలనొప్పి కంటే ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ తలనొప్పి తీవ్రంగా ఉంటుంది.
చర్మ సమస్యలు:
ఈ కరోనా లక్షణాలలో చర్మ సమస్యలు కూడా ఒక రకమైన లక్షణంగా గుర్తించవచ్చు. చేతులు కాళ్ళ మీద రాషేస్ రావడం వంటి లక్షణాలు ఉన్నవారు కూడా కరోనా లక్షణంగా భావించవచ్చు అని డాక్టర్లు విశ్లేషిస్తున్నారు.
మీకు కనుక ఈ పైన తెలుపబడిన లక్షణాలు కనిపిస్తే మీరు చింతించ కుండా, తక్కువ స్థాయిలో లక్షణాలు ఉంటే మీరు ఇంట్లోనే ఉండి ఐసోలేషన్ చేసుకోవడం మంచిది. మీ కుటుంబ సభ్యులకు, మీ చుట్టుపక్కల వారికి దూరంగా ఉండి, లక్షణాల తీవ్రతని బట్టి డాక్టర్స్ ని కన్సల్ట్ చేయడం మంచిది. ఒకవేళ మీకు శ్వాసకు సంబంధించిన సమస్యలు ఉన్నా, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా, చర్మం యొక్క రంగు మారి పోయినట్టు అనిపించిన, మీరు ఉన్న చోటునుండి కదలలేని స్థితిలో ఉన్న వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం. చికిత్స కోసం ఆలస్యం చేయవద్దు..
గమనిక – వివిధ రకాల ఆరోగ్య నిపుణులు అధ్యయనాల ప్రకారం మాకు అందిన సమాచారాన్ని బట్టి ఈ లక్షణాల గురించి కథనాన్ని మీ అవగాహన కోసం మాత్రమే అందించాం. మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా సంబంధిత వైద్యులను సంప్రదించి మీ ఆరోగ్యాన్ని కాపాడు కుంటారని ఆశిస్తున్నాము.
*****
Leave a Reply